Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి రిసెప్షన్ కు వచ్చి వధువుతో ప్రియుడి జంప్!

  • వివాహానికి ముందు రిసెప్షన్ కు హాజరైన ప్రియుడు
  • ముహూర్తం సమయానికి వధువుతో ప్రియుడు పరారీ
  • వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించిన కొత్త దంపతులు
వివాహ రిసెప్షన్‌ కు వచ్చి వధూవరులకు బహుమతి ఇచ్చి ఆశీర్వదించి, తర్వాత అదను చూసుకుని వధువుతో లేచిపోయిన ప్రియుడి ఘటన తమిళనాడులో కలకలం రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. వేలూరు జిల్లాలోని తిరువలానికి చెందిన యురేసియా(24) చెన్నైలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆమె గతంలో భెల్‌ సంస్థలో పనిచేస్తున్న వెంకటేశన్‌ (25) తో ప్రేమలో పడింది. తమ ప్రేమ గురించి పెద్దలకు వివరించింది. ఆమె కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు సరికదా, పొన్నైకు చెందిన యువకుడితో ఆమెకు వివాహం నిశ్చయించారు.

ఈ నేపథ్యంలో గురువారం వేకువ జామున వివాహానికి ముహూర్తం పెట్టారు. దీంతో బుధవారమే వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి వెంకటేశన్ కూడా హాజరయ్యాడు. వధూవరులను ఆశీర్వదించాడు. వారికి గిఫ్ట్ కూడా ఇచ్చాడు. దీంతో యూరేసియా బంధువులు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. వివాహ ముహూర్త సమయానికి ఆమె కనిపించలేదు. అయితే ఇంతలో ఒక ఆలయంలో ఆమెను వివాహం చేసుకున్న వెంకటేశన్ ఆమెతో కలిసి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వారు పెద్దలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 
love marriage
tamilnadu
vellore
lovers

More Telugu News