పెళ్లి రిసెప్షన్ కు వచ్చి వధువుతో ప్రియుడి జంప్!
- వివాహానికి ముందు రిసెప్షన్ కు హాజరైన ప్రియుడు
- ముహూర్తం సమయానికి వధువుతో ప్రియుడు పరారీ
- వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించిన కొత్త దంపతులు
ఈ నేపథ్యంలో గురువారం వేకువ జామున వివాహానికి ముహూర్తం పెట్టారు. దీంతో బుధవారమే వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి వెంకటేశన్ కూడా హాజరయ్యాడు. వధూవరులను ఆశీర్వదించాడు. వారికి గిఫ్ట్ కూడా ఇచ్చాడు. దీంతో యూరేసియా బంధువులు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. వివాహ ముహూర్త సమయానికి ఆమె కనిపించలేదు. అయితే ఇంతలో ఒక ఆలయంలో ఆమెను వివాహం చేసుకున్న వెంకటేశన్ ఆమెతో కలిసి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వారు పెద్దలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.