పాకిస్థాన్‌లో ప్రపంచం తలదించుకునే ఘటన.. సోదరుడు చేసిన తప్పుకు బాలికను నగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాకిస్థాన్‌లో ప్రపంచం తలదించుకునే ఘటన.. సోదరుడు చేసిన తప్పుకు బాలికను నగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు!

  • మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడు
  • యువకుడి సోదరిని నగ్నంగా ఊరేగించాలంటూ విలేజ్ కౌన్సిల్ తీర్పు
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఉగ్రవాదానికి, అరాచకానికి అడ్డాగా మారిన పాకిస్థాన్‌లో ప్రపంచం సిగ్గుతో తలదించుకునే ఘటన జరిగింది. మహిళతో ఓ యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఆ యువకుడి సోదరిని ఊరంతా నగ్నంగా ఊరేగించి బదులు తీర్చుకున్నారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో జరిగిందీ  ఘటన. ప్రావిన్స్‌లోని గ్రామీణ అనధికార చట్టాలు విధిస్తున్న శిక్షలు ఇటీవల చాలా కఠినంగా మారాయి. ‘పరువు’ పేరుతో ప్రతి ఏడాది వందలాది మంది మహిళల ప్రాణాలను ఈ పంచాయితీలు తీసేస్తున్నాయి.

తాజా ఘటనపై పోలీసులు మాట్లాడుతూ, బాధిత బాలిక సోదరుడు గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన మహిళ బంధువులు గ్రామ పెద్దలను ఆశ్రయించారు. దీంతో యువకుడి 14 ఏళ్ల సోదరిని ఊరంతా నగ్నంగా ఊరేగించాలని విలేజ్ కౌన్సిల్ తీర్పు చెప్పింది.

అక్టోబరు 27న బాలికకు స్నానం చేయించిన గ్రామస్తులు ఆమె దుస్తులను బలవంతంగా విప్పించి గంటపాటు ఊరంతా తిప్పుతూ ఊరేగించారు. దేశంలో ఈ ఘటన ప్రకంపనలు సృష్టించడంతో స్పందించిన పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్ట్ చేశారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, మూడు నెలల క్రితం కూడా ఇటువంటి ఘటనే జరిగింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి సోదరిని అందరూ చూస్తుండగా రేప్ చేయాలంటూ విలేజ్ కౌన్సిల్ తీర్పు చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
Pakistan
police
Naked
Girl

More Telugu News