సోదరుడిని గుర్తుచేసుకుని కంటతడి పెట్టిన అచ్చెన్నాయుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోదరుడిని గుర్తుచేసుకుని కంటతడి పెట్టిన అచ్చెన్నాయుడు!

  • నిమ్మాడలో ఎర్రన్నాయుడి వర్ధంతి కార్యక్రమం
  • భావోద్వేగం చెందిన అచ్చెన్నాయుడు
  • మా సోదరుడి కలను నెరవేరుస్తా: అచ్చెన్నాయుడు
దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు వర్ధంతి కార్యక్రమంలో ఆయన సోదరుడు, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కంటతడి పెట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో ఎర్రన్నాయుడి వర్ధంతి కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఆయన కుటుంబసభ్యులు తదితరులు హాజరయ్యారు.

ఎర్రన్నాయుడితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న అచ్చెన్నాయుడు భావోద్వేగం చెందారు. శ్రీకాకుళం అభివృద్ధికి తన సోదరుడు చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని తన సోదరుడు ఆకాంక్షించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. వచ్చే రెండేళ్లలో తన సోదరుడి కలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తానని, ఇప్పటికే జిల్లాలో ప్రాధాన్యతా క్రమంలో సాగునీటిని అందిస్తున్నామని చెప్పారు.
అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం

More Telugu News