సహోద్యోగి భార్యతో ఉండగా.. అడ్డంగా బుక్కైన ఆర్మీ కల్నల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సహోద్యోగి భార్యతో ఉండగా.. అడ్డంగా బుక్కైన ఆర్మీ కల్నల్!

  • లెఫ్టినెంట్ కల్నల్ భార్యతో సంబంధం
  • భర్త ఫిర్యాదుతో దాడి చేసిన మిలిటరీ పోలీసులు
  • కల్నల్ పై విచారణకు ఆదేశం
తన తోటి ఉద్యోగి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ ఆర్మీ కల్నల్ అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన పంజాబ్ లోని భటిండాలో జరిగింది. నిందితుడు భటింటా జోన్ లో అడిషనల్ చీఫ్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. అతను తనతో పాటు పని చేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. లెఫ్టినెంట్ కల్నల్ కూడా ఇంజినీరే. ఓ గోల్ఫ్ టోర్నమెంట్ కోసం లెఫ్టినెంట్ కల్నల్ చండీగఢ్ వెళ్లారు. దీన్ని కల్నల్ అవకాశంగా తీసుకున్నారు.

ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని అంచనా వేసిన లెఫ్టినెంట్ కల్నల్ మిలిటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తెల్లవారుజామున మూడు గంటలకు లెఫ్టినెంట్ కల్నల్ ఇంటిపై దాడి చేసిన మిలిటరీ పోలీసులు... కల్నల్ ను, లెఫ్టినెంట్ కల్నల్ భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఇద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం మిలిటరీ ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు, కల్నల్ ను ఓ సీనియర్ అధికారికి సరెండర్ చేసి, విచారణకు ఆదేశించారు. సహోద్యోగి భార్యతో అక్రమ సంబంధాలను పెట్టుకోవడాన్ని ఆర్మీలో తీవ్రమైన తప్పిదంగా భావిస్తారు. ఇలాంటి నేరాలకు ఐదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంటుంది. తోటి అధికారి కుమార్తెతో సంబంధం పెట్టుకున్న ఓ లెఫ్టినెంట్ కల్నల్ ను ఇటీవలే విధుల నుంచి తప్పించడం జరిగింది. 
colonel
lt colonel

More Telugu News