విశాఖపట్నం సదస్సుకు చంద్రబాబు, బిల్ గేట్స్ హాజరవుతారు: సోమిరెడ్డి
- ఏపీ ప్రభుత్వం-మిలింద గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సదస్సు
- 15 నుంచి 17 వరకు సదస్సు
- 17న హాజరుకానున్న చంద్రబాబు, బిల్ గేట్స్
అన్ని రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ మంత్రులు ఈ సదస్సుకు హాజరవుతారని... ఐయోవా, నెదర్లాండ్స్ యూనివర్శిటీల ప్రతినిధులు కూడా వస్తున్నారని చెప్పారు. భవిష్యత్ వ్యవసాయానికి సంబంధించి 50 నుంచి 60 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 17వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ సదస్సుకు హాజరవుతారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం-మిలింద గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుందని చెప్పారు.