ఔను, లైంగిక వేధింపులకు పాల్పడ్డా.. తప్పు ఒప్పుకుని రాజీనామా చేసిన బ్రిటన్ రక్షణ కార్యదర్శి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఔను, లైంగిక వేధింపులకు పాల్పడ్డా.. తప్పు ఒప్పుకుని రాజీనామా చేసిన బ్రిటన్ రక్షణ కార్యదర్శి

  • జర్నలిస్ట్ తో అసభ్యంగా ప్రవర్తించిన మైఖేల్
  • ప్రధానికి రాజీనామా లేఖ పంపిన రక్షణ కార్యదర్శి
  • మైఖేల్ నిర్ణయాన్ని ప్రశంసించిన థెరిసా మే
సెలబ్రిటీలు, ప్రముఖుల లైంగిక వేధింపులు ఒక్కొక్కటి వెలుగు చూస్తూ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఇటీవల కాలంలో బ్రిటన్ రక్షణ కార్యదర్శి మైఖేల్ ఫాల్లోన్ పేరు కూడా లైంగిక వేధింపులకు సంబంధించి వినిపించడంతో... ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తాను మహిళలను వేధించిన మాట వాస్తవమేనని ఆయన ఒప్పుకున్నారు.

తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రి థెరిసా మేకు ఆయన పంపించారు. ప్రస్తుతం తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని... అయితే, గతంలో మాత్రం తాను తప్పులు చేసిన మాట నిజమేనని రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. కార్యదర్శి పదవికి రాజీనామా చేసినప్పటికీ, ఎంపీగా మాత్రం కొనసాగుతానని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో, లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా ఉన్నత పదవికి రాజీనామా చేసిన తొలి బ్రిటన్ పార్లమెంటేరియన్ గా ఆయన నిలిచారు. మరోవైపు మైఖేల్ నిర్ణయాన్ని ప్రధాని థెరిసా ప్రశంసించారు. విచారణలో అన్ని విషయాలు వెలుగు చూస్తాయని ఆమె అన్నారు.

2002లో జూలియా అనే మహిళా జర్నలిస్టు తొడల మీద చేతులు వేసి, అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై గత వారం ఆయన క్షమాపణలు చెప్పారు. అయితే, ఆయనపై మళ్లీ లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో, చివరకు రాజీనామా చేశారు. 
Michael Fallon
uk defense secretary

More Telugu News