రేపు హైదరాబాద్ కు చంద్రబాబు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు హైదరాబాద్ కు చంద్రబాబు!

  • గవర్నర్ ని కలవనున్న చంద్రబాబు
  • అనంతరం, టీటీడీపీ నేతలతో సమావేశం
  • 3వ తేదీన ఢిల్లీ వెళ్లనున్న బాబు
ఏపీ సీఎం చంద్రబాబు రేపు హైదరాబాద్ కు రానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ నరసింహన్ ని కలవనున్నట్టు సమాచారం. అనంతరం, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో టీటీడీపీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు.

కాగా, ఈ నెల 3వ తేదీన ఢిల్లీలో జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సులో పాల్గొనే నిమిత్తం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళతారని సమాచారం. ఇదిలా ఉండగా, టీటీడీపీ నాయకులతో ఇకపై ప్రతినెలలోనూ సమావేశమవుతానని, తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, వర్గ రాజకీయాలు లేకుండా ఉండాలని చంద్రబాబు ఇటీవల సూచించారు.
చంద్రబాబు
హైదరాబాద్

More Telugu News