నేను కథ చెప్పను .. బౌండ్ స్క్రిప్ట్ ఇస్తాను : 'గరుడవేగ' దర్శకుడు ప్రవీణ్ సత్తారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను కథ చెప్పను .. బౌండ్ స్క్రిప్ట్ ఇస్తాను : 'గరుడవేగ' దర్శకుడు ప్రవీణ్ సత్తారు

  • 'గరుడవేగ'తో వస్తోన్న ప్రవీణ్ సత్తారు
  • స్క్రిప్ట్ రెడీ అయ్యాకనే నటీనటులను కలుస్తాను 
  • స్క్రిప్ట్ చదివితేనే క్లియర్ పిక్చర్ వస్తుంది 
  • ఈ నెల 3వ తేదీన భారీ విడుదల  
ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన 'గరుడ వేగ' సినిమా, ఈ నెల 3వ తేదీన భారీస్థాయిలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఐ డ్రీమ్స్ కి ప్రవీణ్ సత్తారు ఇంటర్వ్యూ ఇచ్చారు. "కథను బట్టి నటీనటులను ఎంపిక చేసుకుంటారా? లేదంటే నటీనటులను దృష్టిలో పెట్టుకునే కథను రాసుకుంటారా"? అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.

 అందుకు ఆయన స్పందిస్తూ .. " స్క్రిప్ట్ మొత్తం బౌండ్ అయిపోయిన తరువాత ఆర్టిస్టులను కలుస్తాను. నిజానికి నాకు కథ చెప్పడం రాదు .. అలా చెప్పడం ఇష్టం ఉండదు కూడా. పూర్తి స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు వాళ్లు తమ పాత్రలో తాము ఊహించుకోవడానికి అవకాశం ఉంటుంది. కథ .. కథనం .. ఎక్కడ ఏం జరుగుతుందనేది క్లియర్ గా తెలుస్తుంది. ఎక్కడైనా వాళ్లకి సందేహం వస్తే .. వెంటనే దానిని నివృత్తి చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్లనే నేను పేపర్ వర్క్ నే ఎక్కువగా నమ్ముతాను" అంటూ తన శైలిని చెప్పుకొచ్చారు.     
praveen sattaru

More Telugu News