సిద్ధార్థ్ సొంత బ్యానర్ పేరు వెనుక పెద్దకథే ఉందండోయ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సిద్ధార్థ్ సొంత బ్యానర్ పేరు వెనుక పెద్దకథే ఉందండోయ్!

  • సిద్ధార్థ్ హీరోగా రూపొందిన 'గృహం'
  • సొంత నిర్మాణంలో చేసిన సినిమా 
  • ఈ నెల 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు
ఇప్పుడంటే హిట్లు లేవు గానీ .. అంతకుముందు తెలుగు .. తమిళ భాషల్లో సిద్ధార్థ్ తన జోరు చూపించాడు. ఇక హిందీలోను సిద్ధార్థ్ కి మంచి గుర్తింపే వుంది. ఒక వైపున హీరోగా కొనసాగుతూనే మరో వైపున సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని సిద్ధార్థ్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన తన బ్యానర్ 'ఎటాకి' ఎంటర్టైన్మెంట్ పైనే ఓ హారర్ థ్రిల్లర్ ను నిర్మించాడు. తెలుగులో ఈ సినిమా 'గృహం' పేరుతో ఈ నెల 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఆయన బ్యానర్ పేరు 'ఎటాకి'పై అందరిలో ఆసక్తి పెరిగింది. 'ఎటాకి' అంటే బెంగాలీ భాషలో 'అదేంటి' అనే అర్థం వస్తుందని సిద్ధార్థ్ చెప్పాడు. " ఏడేళ్ల వయసులో నేను ఓ యాడ్ ఫిల్మ్ లో నటించాను .. అప్పుడు 'అదేంటి' అనే అర్థం వచ్చే మాటను ఏడెనిమిది భాషల్లో పలకాల్సి వచ్చింది. ఎందుకో తెలియదు గానీ, బెంగాలీ భాషలోని 'ఎటాకి' అనే పదం నన్ను బాగా ఆకర్షించింది. పెద్దయిన తరువాత ఏదైనా కంపెనీ పెడితే ఆ కంపెనీకి 'ఎటాకి' అనే పేరు పెడతానని మా అమ్మతో చెప్పాను .. ఆ తరువాత అదే చేశాను" అంటూ తన సొంత బ్యానర్ పేరు వెనుక గల అసలు కథను చెప్పుకొచ్చాడు.
siddharth

More Telugu News