ముఖేష్ అంబానీ ఇంటికొచ్చిన మమతా బెనర్జీ... విందు ఇచ్చిన పారిశ్రామిక దిగ్గజం!
- మహారాష్ట్రలో పెట్టుబడుల కోసం పర్యటిస్తున్న మమత
- తమ రాష్ట్రానికి రావాలని ముఖేష్ ను కోరిన పశ్చిమ బెంగాల్ సీఎం
- శివసేన చీఫ్ ఉద్దవ్ తోనూ చర్చలు
ముంబైకి వచ్చిన ఆమె, తాజ్ ప్యాలెస్ లో బస చేశారు. సాయంత్రం వేళ అంటిల్లాకు వెళ్లి, రాత్రి 9.45 గంటల వరకూ ఉన్నారు. మమత, మహారాష్ట్ర పర్యటన సందర్భంగా అక్కడి పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా సమావేశమై తమ రాష్ట్రానికి రావాలని కోరారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేనూ కలిశారు.