Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఎక్కడికిపోతావు చిన్నవాడా' డైరెక్టర్ తో బన్నీ?

  • 'నా పేరు సూర్య' షూటింగులో బిజీగా బన్నీ 
  • అనిల్ రావిపూడికి ఓకే చెప్పాడంటూ టాక్ 
  • వి.ఐ.ఆనంద్ లైన్ కూడా ఆయనకి నచ్చేసిందంటూ ప్రచారం 
  • ప్రస్తుతం అల్లు శిరీష్ తో వి.ఐ. ఆనంద్    
అల్లు అర్జు ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన లింగుస్వామితో ఓ సినిమా చేయనున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే అంతకన్నా ముందుగా అనిల్ రావిపూడితో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపించింది. ఆయన సినిమాకి సంబంధించిన కథపైనే అనిల్ రావిపూడి కూర్చున్నాడని అంటున్నారు.

 ఇక 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా దర్శకుడు వి.ఐ.ఆనంద్ కూడా అల్లు అర్జున్ కోసం ఒక కథను రెడీ చేస్తున్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం అల్లు శిరీష్ తో ఓ సినిమా చేస్తోన్న వి.ఐ.ఆనంద్ .. రీసెంట్ గా అల్లు అర్జున్ కి ఒక లైన్ వినిపించాడట. బాగా నచ్చిందనీ .. పూర్తి కథగా వినిపించమని అల్లు అర్జున్ చెప్పడంతో, వి.ఐ.ఆనంద్ అదే పనిలో ఉన్నాడని చెబుతున్నారు. కథ ఓకే అయితే ఈ సినిమా కూడా గీతా ఆర్ట్స్ లోనే వుంటుందట .. ఇందులో వాస్తవమెంతో చూడాలి మరి.          
allu arjun

More Telugu News