Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నంలో ఘ‌నంగా హాలోవీన్ వేడుక‌లు.. ఫొటోలు చూడండి!

  • చిన్న‌పిల్ల‌ల‌తో నిండిపోయిన వైట్‌హౌస్ ప్రాంగ‌ణం
  • వివిధ వేష‌ధార‌ణ‌ల్లో హాజ‌రైన పిల్ల‌లు
  • సాదరంగా ఆహ్వానించిన ట్రంప్ దంప‌తులు
అమెరికా అధ్య‌క్ష‌సౌధం వైట్‌హౌస్‌లో హాలోవీన్ పండుగ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. డొనాల్డ్ ట్రంప్‌ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యాక జ‌రుపుకుంటున్న మొద‌టి హాలోవీన్ ఇది. ఈ పండ‌గ‌ను దాదాపు 6000ల మంది చిన్న పిల్ల‌లు, పెద్ద‌ల‌తో క‌లిసి ట్రంప్ దంప‌తులు జ‌రుపుకున్నారు. హాలోవీన్ పండ‌గ‌కు ఒక‌రోజు ముందుగానే (అక్టోబ‌ర్ 30) వైట్‌హౌస్ సౌత్ లాన్‌లో ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించారు.

వ‌ర్జీనియా, మేరీల్యాండ్‌, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా రాష్ట్రాల్లోని 20 పాఠ‌శాల‌లకు చెందిన విద్యార్థులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు. ర‌క‌ర‌కాల వేష‌ధార‌ణ‌ల్లో పిల్ల‌లంద‌రినీ డొనాల్డ్ ట్రంప్‌, మెలానియాలు సాద‌రంగా ఆహ్వానించారు. హాలోవీన్ పండ‌గ‌కు అనుగుణంగా ర‌క‌ర‌కాల బొమ్మ‌లు, గుమ్మ‌డికాయ‌లతో ప్రాంగణాన్ని అల‌క‌రించారు. పిల్ల‌లంద‌రికీ బ‌హుమ‌తుల‌ను పంచిపెట్టి శుభాకాంక్ష‌లు తెలిపారు.



    
halloween
white house
donald trump
melania trump

More Telugu News