Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వందేళ్ల వృద్ధురాలిపై అత్యాచారయ‌త్నానికి పాల్ప‌డిన యువ‌కుడు... మ‌ర‌ణించిన మ‌హిళ‌

  • తాగిన మ‌త్తులో అఘాయిత్యం
  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘ‌ట‌న‌
  • యువ‌కుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
మ‌ద్యం మ‌త్తులో వందేళ్ల వృద్ధురాలిపై అత్యాచార‌య‌త్నానికి పాల్ప‌డ్డాడో యువ‌కుడు. దీంతో ఆ మ‌హిళ మ‌ర‌ణించిన ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్ జిల్లాలో జానీ గ్రామంలో జ‌రిగింది. నిస్స‌హాయ స్థితిలో ఉన్న వృద్ధురాలిని అంకిత్ పునియా అనే యువ‌కుడు త‌ప్ప‌తాగి అత్యాచారం చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. యువ‌కుడి బ‌లానికి ఆమె లొంగిన‌ప్ప‌టికీ గ‌ట్టిగా అర‌వ‌డంతో ప‌క్కింట్లో నివ‌సిస్తున్న ఆమె సోద‌రుడు, ఇత‌ర చుట్టుప‌క్క‌ల వాళ్లు వ‌చ్చారు. అంకిత్ పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా అత‌న్ని ప‌ట్టుకుని దేహ‌శుద్ధి చేసి పోలీసుల‌కు అప్ప‌గించారు. అయితే అత్యాచార‌య‌త్నం కార‌ణంగానే వృద్ధురాలు మ‌ర‌ణించడంతో పోలీసులు అత‌నిపై కేసు న‌మోదు చేసి అరెస్టు చేశారు.  
rape
100 years
uttar pradesh
jaani village
police
crime

More Telugu News