Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జడలబర్రెపై కూర్చున్న రామ్ చరణ్.. నడిపించుకుంటూ వెళ్తున్న ఉపాసన!

  • ఫొటోలను పోస్ట్ చేసిన ఉపాసన
  • జడల బర్రెపై అటో కాలు ఇటో కాలేసి కూర్చున్న చెర్రీ
  • బాగున్నాయంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా పలు విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా, ఓ ఆసక్తికర ఫొటోను తన ఫేస్ బుక్ ఖాతాలో ఆమె పోస్ట్ చేశారు. జడల బర్రెపై అటో కాలు ఇటో కాలు వేసి రామ్ చరణ్ కూర్చుని ఉండగా, దానిని నడిపించుకుంటూ ఉపాసన వెళ్తుండటం ఈ ఫొటోలో కనిపిస్తుంది. ఈ సందర్భంగా రెండు ఫొటోలను ఉపాసన పోస్ట్ చేశారు.

అయితే, వాళ్లిద్దరూ ఏ ప్రాంతంలో పర్యటిస్తుండగా ఈ ఫొటోలు దిగారో ఉపాసన పేర్కొనలేదు. కాగా, ఈ ఫొటోలు నెటిజన్లకు బాగా నచ్చడంతో ప్రశంసలు కురిపించారు. ‘మెగాపవర్ స్టార్ తో ఎంజాయ్ చేయండి’, ‘లవ్ల్ లీ కపుల్’, ‘వావ్, అరుదైన జ్ఞాపకం’, ‘నైస్ పిక్’, ‘సూపర్’ అని నెటిజన్లు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఉపాసన
రామ్ చరణ్

More Telugu News