మహేశ్ 27వ మూవీ బోయపాటి దర్శకత్వంలో?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ 27వ మూవీ బోయపాటి దర్శకత్వంలో?

  • 14 రీల్స్ వారికి డేట్స్ ఇచ్చిన మహేశ్ 
  • బోయపాటితో సంప్రదింపులు 
  • మాస్ యాక్షన్ నేపథ్యంలోనే కథ  
14 రీల్స్ సంస్థవారు మహేశ్ తో ఒక సినిమా చేయాలనుకుంటున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. గతంలో వాళ్లు మహేశ్ తో 'దూకుడు' .. 'ఆగడు' .. '1 నేనొక్కడినే' సినిమాలు చేశారు. వాళ్లకి మరో సినిమా చేసి పెడతానని ఆ సమయంలోనే మహేశ్ మాట ఇచ్చాడట. తన 27వ సినిమాను ఈ బ్యానర్లో చేయడానికిగాను ఆయన డేట్స్ కూడా ఇచ్చేశాడనేది తాజా సమాచారం.

 దాంతో 14 రీల్స్ వారు ఈ సారి మాంచి మాస్ మూవీ చేయాలనే ఉద్దేశంతో బోయపాటి శ్రీనును సంప్రదించారట. ప్రస్తుతం వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. మహేశ్ తో మూవీ చేసే ఛాన్స్ కోసమే బోయపాటి కొంతకాలంగా ఎదురుచూస్తున్నాడు. అందువలన ఆయన మహేశ్ కోసం మంచి కథను సిద్ధం చేయనున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి మహేశ్ .. బోయపాటి కాంబినేషన్ ఖరారైపోయినట్టేననేది ఫిల్మ్ నగర్ టాక్.  
maheshbabu

More Telugu News