ఇస్లామిక్ స్టేట్ హిట్ లిస్ట్‌లో నాలుగేళ్ల బ్రిటన్ బుల్లి రాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇస్లామిక్ స్టేట్ హిట్ లిస్ట్‌లో నాలుగేళ్ల బ్రిటన్ బుల్లి రాజు

  • జార్జ్‌ను చంపేస్తామంటూ సోషల్ మీడియాలో పోస్ట్
  • ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిమ
  • స్కూలు వద్ద భద్రత పెంపు
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్  స్టేట్ హిట్‌లిస్ట్‌లో బ్రిటన్ బుల్లి రాజు జార్జ్ పేరు చేరింది. ప్రిన్స్ విలియమ్స్, కేట్ మిడిల్టన్‌ల  నాలుగేళ్ల కుమారుడైన జార్జ్‌ను హత్య చేస్తామంటూ ఇస్లామిక్ స్టేట్ గ్రూపు సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బ్రిటన్ కాబోయే రాజు జాబితాలో మూడో వ్యక్తిగా ఉన్న జార్జ్  గత నెలలోనే ప్రైమరీ స్కూల్‌లో చేరాడు.

సెంట్రల్ లండన్‌లోని థామస్ బాటెర్‌సీ స్కూల్లో చదువుతున్న జార్జ్ ఫొటోతో సహా మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్‌’లో పోస్ట్ చేసిన ఉగ్రవాదులు అతడిని చంపేస్తామని హెచ్చరించారు. అరబిక్ భాషలో రాసిన ఈ పోస్టులో ‘‘యుద్ధమనేది వస్తే మేం ప్రతీకారం తీర్చుకుంటాం’’ అని ఉంది. ‘టెలిగ్రామ్’లో మెసేజ్‌లు పూర్తిగా ఎన్‌క్రిప్ట్ అవడం, ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియకపోవడంతో ఉగ్రవాదులు ఈ ప్లాట్‌ఫాంనే ఎంచుకుంటున్నారు. ఐసిస్ హెచ్చరికల నేపథ్యంలో జార్జ్ చదువుకుంటున్న స్కూల్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. 
Britian
Prince
George
IsIs

More Telugu News