Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు కన్నుమూత!

  • సంతాపం వ్యక్తం చేసిన  సినీ ప్రముఖులు, కమ్యూనిస్టు నాయకులు
  • నిర్మాతగా ఆయన తొలి సినిమా ‘అగ్గిమీద గుగ్గిలం’
  • పలు హిట్ చిత్రాలను అందించిన పూర్ణచంద్రరావు
ప్రముఖ సినీ నిర్మాత, కమ్యూనిస్టు నాయకుడు అట్లూరి పూర్ణచంద్రరావు (92) కన్నుమూశారు. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం కమలానగర్ లో తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. పూర్ణచంద్రరావు మృతిపై పలువురు సినీ ప్రముఖులు, కమ్యూనిస్టు నాయకులు సంతాపం తెలిపారు. కాగా, కృష్ణా జిల్లా చవుటపల్లి గ్రామంలో పూర్ణచంద్రరావు జన్మించారు.

పదో తరగతి తప్పడంతో మనస్తాపం చెందిన ఆయన ఆత్మహత్య చేసుకుందామని విజయవాడ కృష్ణానది వద్దకు వెళ్లారు. అయితే, ఆ తర్వాత మనసు మార్చుకుని, ఓ కాంట్రాక్టర్ వద్ద పనిలో చేరారు. ఆ తర్వాత నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ లో రిప్రజంటేటివ్ గా చేరారు. ఈ క్రమంలో గుంతకల్లు నవయుగ బ్రాంచ్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఇక్కడ మేనేజర్ గా పనిచేస్తున్న సమయంలోనే దర్శకుడు తాతినేని ప్రకాశరావు వద్ద సహాయకుడిగా పని చేసేందుకు మద్రాసు వెళ్లారు.

ఈ క్రమంలో దర్శకులు విఠలాచార్య, పి. పుల్లయ్య దగ్గర పనిచేశారు. ‘దేవదాసు’ నిర్మాత డిఎల్ నారాయణ, ఎస్. భావనారాయణల ప్రోత్సాహంతో ప్రొడక్షన్ రంగంలోకి దిగారు. విజయవాడ నవభారత్ బుక్ హౌస్ ప్రకాశరావుని భాగస్వామిగా చేసుకుని ‘అగ్గిమీద గుగ్గిలం’ సినిమాకు ఆయన నిర్మాతగా అవతారమెత్తారు. ఆ తర్వాత ‘ఉక్కుపిడుగు’, ‘రౌడీరాణి’, ‘పాపం పసినవాడు’, ‘యమగోల’ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. కేవలం, తెలుగులోనే కాకుండా ఇతర భాషాచిత్రాలకు కూడా ఆయన నిర్మాతగా వ్యవహరించారు.
అట్లూరి పూర్ణచంద్రరావు
నిర్మాత

More Telugu News