'జై లవకుశ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ దాచిపెట్టిన ఆ ఇద్దరి పేర్లూ ఎవరివో తెలిసిపోయింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జై లవకుశ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ దాచిపెట్టిన ఆ ఇద్దరి పేర్లూ ఎవరివో తెలిసిపోయింది!

  • అప్పట్లో పేర్లు చెప్పబోనన్న ఎన్టీఆర్
  • ఇప్పుడు వారెవరో చెప్పేసిన రచయిత కోన వెంకట్
  • ఆ ఇద్దరూ కొరటాల శివ, ఎస్ఎస్ రాజమౌళిలట
తాను 'జై లవకుశ' చిత్రంలో నటించడానికి ఇద్దరు ముఖ్య కారకులు ఉన్నారని, వారిద్దరి పేర్లు ఇప్పుడు చెప్పబోనని, సినిమా విడుదల అయిన తరువాత, హిట్ అయితే మాత్రమే చెబుతానని సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు ఎన్టీఆర్ చెప్పిన మాటలు గుర్తున్నాయా? ఆ ఇద్దరు ఎవరో ఇప్పుడు తేలిపోయింది. అప్పట్లో ఎన్టీఆర్ అభిమానులు ఎస్ఎస్ రాజమౌళి, వీవీ వినాయక్ పేర్లను ఊహించారు.

 కానీ, తాజాగా రచయిత కోన వెంకట్ కు ఓ అభిమాని నుంచి సోషల్ మీడియాలో ఇదే విషయమై ఓ ప్రశ్న ఎదురైంది. ఆ వెంటనే క్లారిటీ ఇచ్చేసిన కోన వెంకట్, వారు కొరటాల శివ, ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పి, అభిమానులు ఓ 50 పర్సెంట్ సక్సెస్ అయ్యారని అన్నాడు. ఈ ప్రాజెక్టును ఎన్టీఆర్ ఓకే చేయడం వెనుక కొరటాల శివ కూడా ఉన్నాడని కోన వెంకట్ చెప్పేంతవరకూ ఎవరికీ తెలియకపోవడం గమనార్హం.
koratala
Ntr
rajamouli
vv vinayak

More Telugu News