వికెట్ తీయలేక న్యూజిలాండ్ ఆపసోపాలు... భారీ స్కోరు దిశగా ఇండియా పరుగులు!

  • సెంచరీ సాధించిన కోహ్లీ
  • హాఫ్ సెంచరీ దాటేసిన విరాట్ కోహ్లీ
  • అవుట్ చేసేందుకు న్యూజాలాండ్ ఆపసోపాలు
కాన్పూర్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు భారీ స్కోరు దిశగా దూసుకువెళుతోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ 14 పరుగుల స్వల్ప స్కోరుకే అవుట్ అయినా, మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలసి, విరాట్ కోహ్లీ మెరుపులు మెరిపించాడు. ఈ క్రమంలో రోహిత్ సెంచరీ సాధించగా, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని భారీ స్కోరు దిశగా సాగుతున్నారు.

ప్రస్తుతం భారత స్కోరు 35 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 196 పరుగులు కాగా, కోహ్లీ 69, రోహిత్ 109 పరుగులతో ఆడుతున్నారు. వీరిద్దరి జోడీని విడదీసేందుకు న్యూజిలాండ్ బౌలర్లు చేస్తున్న అన్ని ప్రయత్నాలూ విఫలం అవుతున్నాయి. బౌలర్లను ఎంతగా మార్చి చూసినా ఓ వైపు నుంచి రోహిత్, మరో వైపు నుంచి కోహ్లీ, బంతి అందినప్పుడెల్లా బౌండరీకి దాన్ని తరలిస్తూ స్కోరు బోర్డును పెంచారు.
Go Back to Shorts
india
newzealand
kanpur
kohli
rohit

More Telugu News