రేవంత్ నోట.. జైలు నుంచి వచ్చినప్పటి మాటే ఇప్పుడు కూడా... 'ఆట మొదలైంది'!

  • నిజమైన ఆట ఇప్పుడే స్టార్ట్
  • ఇది ఫైనల్స్ 
  • రేపు పీపుల్స్ ప్లాజాకు రండి
  • కేసీఆర్ పతనానికి నాంది పలికే నిర్ణయం రేపే
  • కార్యకర్తలతో రేవంత్ రెడ్డి
తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి, తనకు మధ్య ఆట మొదలైందని టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 'ఓటుకు నోటు' కేసులో జైలుకు వెళ్లి, ఆపై బయటకు వచ్చిన రోజు చేసిన ప్రసంగంలో చెప్పిన మాటలనే, నేడు కార్యకర్తల ఎదుట రేవంత్ మరోసారి గుర్తు చేశారు.

"ఆట మొదలైంది. ఆనాడు జైలు నుంచి వచ్చినప్పుడే చెప్పినా... ఆట మొదలైందని చెప్పి. నిజమైన ఆట ఇప్పుడు మొదలైంది. ఫైనల్స్ కు వచ్చేసింది. రేప్పొద్దున పీపుల్స్ ప్లాజాకు రండి. నక్లెస్ రోడ్డుమీద, హైదరాబాద్ నడిబొడ్డున, బుద్ధుడి ఎదురుగా నిర్ణయం తీసుకోనున్నా. ఆ నిర్ణయం ఈ రాష్ట్రంలో కేసీఆర్ పతనానికి నాంది పలకాలి. ఆ నిర్ణయం కేసీఆర్ దోపిడీని ఆపాలి" అని కార్యకర్తల ఈలలు, కేరింతల మధ్య రేవంత్ వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
revant
peoples plaza
hyderabad

More Telugu News