మహేశ్ మాట ఇచ్చాడట .. అదే బ్యానర్లో మరో సినిమా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ మాట ఇచ్చాడట .. అదే బ్యానర్లో మరో సినిమా!

  • గతంలో మహేశ్ తో మూడు సినిమాలు చేసిన 14 రీల్స్ 
  • 'దూకుడు' మాత్రమే హిట్ అయింది 
  • మిగతా రెండు భారీ పరాజయాలు 
  • మరోసారి మహేశ్ తో చేయడానికి సన్నాహాలు  
14 రీల్స్ సంస్థవారు వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఈ బ్యానర్ పై మహేశ్ బాబు 'దూకుడు' ... '1 నేనొక్కడినే' .. 'ఆగడు' సినిమాలు చేశాడు. వీటిలో 'దూకుడు' మాత్రమే భారీ విజయాన్ని అందుకోగా మిగతా రెండు పరాజయం పాలయ్యాయి. దాంతో ఈ నిర్మాతలు నాని హీరోగా 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' చేసి హమ్మయ్య అనుకున్నారు. కానీ ఆ తరువాత చేసిన 'లై' సినిమా దెబ్బకొట్టేసింది.

 ఈ నేపథ్యంలో ఈ నిర్మాతలు మళ్లీ మహేశ్ తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ బ్యానర్ కి మరో సినిమా చేస్తానని గతంలో మహేశ్ మాట ఇచ్చాడనీ, అందువలన ఆయన క్రేజ్ కి తగిన కథ కోసం నిర్మాతలు అన్వేషణ మొదలుపెట్టారని సమాచారం. కొత్తదనమున్న కథల కోసం యువ దర్శకులతోను మాట్లాడుతున్నారని తెలుస్తోంది. కథ ఓకే అయిన తరువాతనే మిగతా విషయాలపై దృష్టిపెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం మహేశ్ కమిటైన ప్రాజెక్టుల తరువాత ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. 
maheshbabu

More Telugu News