దొంగతనం కేసులో కటకటాల వెనక్కి ‘ఇండియన్ ఐడల్’!
- తైక్వాండో క్రీడలో బంగారు పతకాలు సాధించిన నిందితుడు
- దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు
- మీడియా ఎదుట నిందితుడితో పాటపాడించుకున్న పోలీసులు
దీపక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఢిల్లీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్, తైక్వాండో క్రీడాకారుడు అయిన సూరజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తైక్వాండోలో సూరజ్ రెండు బంగారు పతకాలు కూడా సాధించడం విశేషం. అలాగే ఓ టీవీ చానల్ నిర్వహిస్తున్న ‘ఇండియన్ ఐడల్’ రియాలిటీ షోలోనూ పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు. సూరజ్‌తో పాటు అతడి స్నేహితులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం పోలీసులు సూరజ్‌తో చక్కని పాట పాడించుకోవడం కొసమెరుపు!