పూల అంగళ్లు తొలగించిన మునిసిపల్ సిబ్బంది.. చిత్తూరులో ఉద్రిక్తత!
- షోరూమ్ యజమాని ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
- అడ్డుకునేందుకు యత్నించిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు
- టీడీపీ నాయకుల రాకతో పరిస్థితి ఉద్రిక్తం
దీంతో అంగళ్ల నిర్వాహకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, అతని అనుచరులు అక్కడికి చేరుకున్నారు. వారికి పోటీగా టీడీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి మరింతగా ముదరకముందే పోలీసులు సీకేబాబు, అతని అనుచరులను అక్కడి నుంచి బలవంతంగా తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.