అఖిల్ కోసం రిలీజ్ డేట్ మార్చుకున్న నాని మూవీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అఖిల్ కోసం రిలీజ్ డేట్ మార్చుకున్న నాని మూవీ!

  • అఖిల్ తాజా చిత్రంగా 'హలో'
  • దర్శకుడిగా విక్రమ్ కుమార్ 
  • డిసెంబర్ 22వ తేదీన విడుదల
  • డిసెంబర్ 15న 'మిడిల్ క్లాస్ అబ్బాయి'
నాని కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' తెరకెక్కుతోంది. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే అదే రోజున అఖిల్ సినిమాను రిలీజ్ చేయడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నారు.

 విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ 'హలో' సినిమా చేస్తున్నాడు. నాగార్జున నిర్మిస్తోన్న ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని నాగార్జున భావించడంతో, ఆ రోజున తమ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనను దిల్ రాజు విరమించుకున్నారట. వారం రోజుల ముందుగానే .. అంటే, డిసెంబర్ 15వ తేదీనే 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారనే టాక్ వినిపిస్తోంది.  
akhil
kalyani priyadarshan

More Telugu News