Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కంచ ఐల‌య్య‌ ఇంటి వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త!

  • విజ‌య‌వాడలో స‌భకు అనుమ‌తి లేక‌పోవ‌డంతో కంచ ఐల‌య్య ఇంటి వ‌ద్ద పోలీసుల మోహ‌రింపు
  • హైద‌రాబాద్ తార్నాక నుంచి విజ‌య‌వాడ బ‌య‌లుదేరేందుకు టీ మాస్ య‌త్నం
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు, తోపులాట‌
విజ‌య‌వాడలో ప్రొ.కంచ ఐల‌య్య‌కు మ‌ద్దతుగా ఈ రోజు నిర్వ‌హించ‌త‌లపెట్టిన స‌భ‌కు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌ని విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైద‌రాబాద్ తార్నాక‌లోని ప్రొ.కంచ ఐల‌య్య ఇంటి వ‌ద్ద పోలీసులు మోహ‌రించారు. ఇంటి నుంచి ఐల‌య్య బ‌య‌ట‌కు వ‌స్తే అరెస్టు చేస్తామ‌ని ఇప్ప‌టికే తేల్చి చెప్పారు. అయితే, కంచ ఐల‌య్య ఇంటి వ‌ద్ద‌కు చేరుకున్న టీ మాస్ కార్య‌క‌ర్త‌లు అల‌జ‌డి రేపారు.

అక్క‌డి నుంచి విజ‌యవాడ‌ స‌భ‌కు వెళ్లేందుకు టీమాస్ కార్య‌క‌ర్తలు బ‌య‌లుదేరారు. దీంతో పోలీసులు వెంట‌నే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల‌కు, టీ మాస్ కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య తోపులాట జ‌రిగి వాగ్వివాదం చోటు చేసుకుంది.  
kancha ilaiah

More Telugu News