ఫ్రెంచ్ ఓపెన్ సూప‌ర్ సిరీస్: సెమీ ఫైన‌ల్‌కి చేరుకున్న సింధు, శ్రీకాంత్‌, ప్ర‌ణ‌య్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్రెంచ్ ఓపెన్ సూప‌ర్ సిరీస్: సెమీ ఫైన‌ల్‌కి చేరుకున్న సింధు, శ్రీకాంత్‌, ప్ర‌ణ‌య్‌

  • చైనా క్రీడాకారిణి చెన్ యూఫేని ఓడించిన సింధు
  • ఈ సిరీస్‌లో మొద‌టి సెమీస్‌కి చేరుకున్న పీవీ సింధు
  • సెమీ ఫైన‌ల్‌లో శ్రీకాంత్ వ‌ర్సెస్‌ ప్ర‌ణ‌య్‌
డెన్మార్క్ ఓపెన్ సూప‌ర్ సిరీస్‌లో త‌న‌ను ఓపెనింగ్ రౌండ్‌లోనే నిష్క్ర‌మించేలా చేసిన చైనా క్రీడాకారిణి చెన్ యూఫేను 21-14, 21-14 తేడాతో ఓడించి పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ సూప‌ర్ సిరీస్ మ‌హిళ‌ల సింగిల్స్‌ సెమీ ఫైన‌ల్‌కి చేరుకుంది. ఈ సిరీస్‌లో ఆమె సెమీస్‌కి చేరుకోవ‌డం ఇదే మొద‌టిసారి. వీరిద్ద‌రికీ జ‌రిగిన 5 మ్యాచుల్లో మూడింటిని సింధు గెలిచింది. సెమీ ఫైన‌ల్స్‌లో కొరియా క్రీడాకారిణి సంగ్ జి హ్యూన్‌తో గానీ, జ‌పాన్ 5వ సీడ్ అకానే య‌మ‌గూచితో గానీ త‌ల‌ప‌డ‌వ‌చ్చు.

మ‌రోవైపు పురుషుల సింగిల్స్‌లో కూడా భార‌త ఆట‌గాళ్లు హెచ్ ఎస్ ప్ర‌ణ‌య్‌, కిడాంబి శ్రీకాంత్‌లు కూడా సెమీ ఫైన‌ల్‌కి చేరుకున్నారు. హెచ్ ఎస్ ప్ర‌ణ‌య్, ద‌క్షిణ కొరియాకు చెందిన జియోన్ హ్యోక్‌ను 21-16, 21-16 తేడాతో ఓడించాడు. కిడాంబి శ్రీకాంత్‌, చైనాకు చెందిన షి యూకీని 8-21, 21-19, 21-9 తేడాతో ఓడించాడు. దీంతో సెమీ ఫైన‌ల్‌లో హెచ్ ఎస్ ప్ర‌ణ‌య్‌, శ్రీకాంత్ ఒక‌రితో ఒక‌రు త‌ల‌పడే ప‌రిస్థితి ఏర్ప‌డింది.
french open super series
badminton
semis
sindhu
srikanth
prannoy

More Telugu News