దిల్ రాజు నిర్మాణంలో రామ్ మూవీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దిల్ రాజు నిర్మాణంలో రామ్ మూవీ!

  • యంగ్ హీరోలతో దిల్ రాజు వరుస సినిమాలు 
  • రామ్ తోను ఓ మూవీ
  • దర్శకుడిగా త్రినాథరావు నక్కిన 
  • త్వరలోనే సెట్స్ పైకి    
ఒక వైపున మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలను .. మరో వైపున యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే సినిమాలను చేయడంలో దిల్ రాజు ముందుంటారు. ప్రస్తుతం ఆయన యువ హీరోలతో వరుస సినిమాలు నిర్మించడంలో ఫుల్ బిజీగా వున్నారు. ఒక వైపున నానితో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా చేస్తోన్న ఆయన, రాజ్ తరుణ్ తోను ఓ సినిమాను మొదలెట్టేశారు.

నిఖిల్ తోను ఓ సినిమా చేయబోతున్నట్టుగా చెప్పిన దిల్ రాజు, త్వరలో రామ్ తోను ఒక సినిమాను నిర్మించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకి నక్కిన త్రినాథరావు దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు సమాచారం. గతంలో ఆయన తెరకెక్కించిన 'సినిమా చూపిస్త మావ' .. 'నేను లోకల్' సినిమాలు సక్సెస్ ను సాధించాయి. మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.  
ram

More Telugu News