Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అన్నింటికీ ఆధార్ కార్డు అనుసంధానం'పై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన మ‌మ‌తా బెన‌ర్జీ

  • త‌న మొబైల్ నెంబ‌ర్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయ‌బోన‌ని ఇటీవ‌లే చెప్పిన మ‌మ‌తా బెన‌ర్జీ
  • మ‌మ‌తా బెన‌ర్జీ పిటిష‌న్‌పై ఈ నెల 30న సుప్రీంకోర్టులో విచార‌ణ
అవ‌కాశం దొరికిన ప్ర‌తిసారి కేంద్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతోన్న ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. త‌న మొబైల్ నెంబ‌ర్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయ‌బోన‌ని, ఏం చేసుకుంటారో చేసుకోండ‌ని ఇటీవ‌లే తేల్చి చెప్పిన విష‌యం తెలిసిందే. ఆధార్ కార్డును అన్నింటికీ లింక్ చేయాల‌ని సూచిస్తోన్న కేంద్ర ప్ర‌భుత్వంపై ఆమె మండిప‌డుతున్నారు. ఇదే విష‌యంపై ఆమె ఈ రోజు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అన్నింటికీ ఆధార్ కార్డును త‌ప్ప‌నిస‌రి చేయ‌డం ప‌ట్ల అభ్యంత‌రాలు తెలుపుతూ పిటిష‌న్ వేశారు. ఈ పిటిష‌న్‌పై న్యాయ‌స్థానం ఈ నెల 30న విచార‌ణ జ‌ర‌ప‌నుంది.  
Mamata Banerjee
supreme

More Telugu News