బిగ్‌బాస్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఢించ‌క్ పూజ‌.. టాస్క్‌లో భాగంగా పాట పాడిన ఢించ‌క్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్‌బాస్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఢించ‌క్ పూజ‌.. టాస్క్‌లో భాగంగా పాట పాడిన ఢించ‌క్‌

  • త‌న‌దైన శైలిలో పాట పాడిన పూజ‌
  • లిరిక్స్‌లో సాయం చేసిన అర్షి, ఆకాశ్‌
  • స‌ల్మాన్ స్పంద‌న కోసం ఎదురుచూస్తున్న ప్రేక్ష‌కులు
క‌ర్ణ‌క‌ఠోర గొంతు, అర్థం ప‌ర్థం లేని లిరిక్స్‌తో పాట‌లు పాడి యూట్యూబ్‌లో సెన్సేష‌న్‌గా ఎదిగిన ఢించ‌క్ పూజ ఇటీవ‌ల వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హిందీ బిగ్‌బాస్‌లో అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. పూజ అడుగు పెట్టిన మొద‌టి వారంలోనే టీఆర్‌పీల కోసం ఆమె ప్ర‌తిభ‌ను వాడుకోవ‌డం ప్రారంభించారు బిగ్‌బాస్ నిర్వాహ‌కులు. అందుకోసం బిగ్‌బాస్ గురించి హౌస్ పాట పాడేలా చేశారు. ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌లో భాగంగా ఢించ‌క్‌తో బిగ్‌బాస్ పాట పాడించాడు. ఆ పాట వీడియోను త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో బిగ్‌బాస్ నిర్వాహ‌కులు పోస్టు చేశారు.

త‌న‌దైన శైలి లిరిక్‌ల‌తో ఢించ‌క్ పాడిన పాట ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. బిగ్‌బాస్ ఇంట్లో ఉన్న వాళ్ల మీద సింగిల్ లైన్ కామెంట్లు చేస్తూ ఈ పాట రాయ‌డంలో ఇత‌ర కంటెస్టెంట్ల‌యిన అర్షి ఖాన్‌, ఆకాశ్ ద‌డ్లానీలు పూజ‌కు స‌హాయం చేశారు. ఏదేమైనా పూజ ఎంట్రీ రోజే ఆమె పాట‌ల‌ను హేళ‌న చేసిన స‌ల్మాన్‌, ఇప్పుడు పూజ బిగ్‌బాస్ ఇంటి లోప‌ల పాడిన పాట‌కు ఎలా స్పందిస్తాడో చూడాలంటే వీకెండ్ వార్ ఎపిసోడ్‌ వ‌ర‌కు ఆగాల్సిందే!
big boss 11
dinchak pooja
live song
rapper
arshi khan
colors
salman khan
akash dadlani

More Telugu News