తన పాట రీమిక్స్ చేసి క్రెడిట్ ఇవ్వలేదని మేనల్లుడిపై మండిపడుతున్న అనూ మాలిక్!
- `గోల్మాల్ అగైన్`లో `ఇష్క్` సినిమా పాట రీమిక్స్
- `నీంద్ చూరాయి` ట్యూన్ తనదంటున్న అనూ మాలిక్
- లేదు... ఇంగ్లిషు పాటకి కాపీ అంటున్న అమాల్ మాలిక్
`పాటను ఎలా కావాలంటే అలా మార్చుకోండి. కానీ ఒరిజినల్ ట్యూన్ ఇచ్చిన వారిని మర్చిపోవడం సబబు కాదు. అమాల్ బాగా ఎదగాలని నేను కోరుకుంటాను. కానీ ఆడియోలో నా పేరు లేకపోవడం వల్ల యువతరానికి నా గురించి తెలియక తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది` అని అనూ మాలిక్ అన్నాడు.
అయితే అనూ మాలిక్ ఆరోపణలపై అమాల్ మాలిక్ మరో రకంగా స్పందించాడు. `ఆయన అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కూడా ఈ పాట ట్యూన్‌ను ఇంగ్లిషులో లీనియర్ పాడిన `సెండింగ్ ఆల్ మై లవ్` స్ఫూర్తితో రూపొందించాడు. మేం కూడా ఇంగ్లిషు పాట హక్కులను తీసుకున్నాం. అయినప్పటికీ, ఈ పాటను రీమిక్స్ చేసే ముందు అంకుల్ అనుమతి తీసుకోవాలనుకున్నాం. అసలు రీమిక్స్ కూడా ఆయనతోనే పాడించాలనుకున్నా. కానీ నా కాల్స్‌కి ఆయన స్పందన ఇవ్వలేదు. దీంతో వదిలేశా` అని అమాల్ మాలిక్ తెలిపాడు.