అది తప్పని నిరూపించండి.. ఆత్మహత్య చేసుకుంటా: టీజీ వెంకటేష్
- ఆర్యవైశ్యులు ద్రవిడులు కాదని నిరూపించండి
- ఐలయ్య పుస్తకంపై పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయలేదు
- అమెరికాకు ఐలయ్య వత్తాసు పలుకుతున్నారు
త్వరలోనే ఈ కేసు మళ్లీ విచారణకు రానుందని టీజీ వెంకటేష్ తెలిపారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ కాలం గడుపుతున్న ఐలయ్య... వెనకబడిన కులాలకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికాలాంటి సామ్రాజ్యవాద దేశాలకు ఐలయ్య వత్తాసు పలుకుతున్నారని... అలాంటి వ్యక్తికి కమ్యూనిస్టులు మద్దతు పలకడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.