Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మెర్సల్' ను తట్టుకుని నిలబడిన చిన్నసినిమా .. పెద్ద హిట్ కొట్టేసింది!

  • 'మెర్సల్' భారీ బడ్జెట్ మూవీ 
  • దాంతో పాటు విడుదలైన చిన్నసినిమా 'మెయ్యాదమాన్' 
  • మౌత్ టాక్ తో ఊపందుకున్న చిన్నసినిమా వసూళ్లు 
  • పెరిగిన థియేటర్ల సంఖ్య    
ఒక్కోసారి పెద్ద సినిమాలతో పాటు విడుదలైన చిన్న సినిమాలు .. అంచనాలను తలక్రిందులు చేస్తూ పెద్ద హిట్ కొట్టేస్తుంటాయి. తెలుగులో ఇటీవల 'మహానుభావుడు' విషయంలో ఇదే జరిగింది. ఇక తమిళనాట కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. తమిళంలో దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు 'మెర్సల్' వచ్చింది. ఆ సినిమాతో పాటు 'మెయ్యాదమాన్' అనే చిన్నసినిమా కూడా విడుదలైంది.

తెలుగులో సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి తనయుడు 'వైభవ్' ఈ సినిమాలో హీరోగా చేశాడు. 'మెర్సల్' కారణంగా తొలి రెండు రోజులు ఈ సినిమా గురించి మాట్లాడుకున్నవారు లేరు. కానీ ఆ తరువాత మౌత్ టాక్ తో వసూళ్లు ఊపందుకున్నాయి. వీకెండ్ కు థియేటర్స్ సంఖ్య పెంచాల్సి వచ్చింది. ఆద్యంతం వినోదభరితంగా సాగే వన్ సైడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. బడ్జెట్ పరంగా .. వసూళ్ల పరంగా చూసుకుంటే ఇది భారీ హిట్ ను సాధించిందనేది కోలీవుడ్ టాక్.    
vaibhav

More Telugu News