ఫిఫా అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్‌కి గంగూలీ, సచిన్
- చివరి అంకానికి చేరుకున్న ఫిఫా అండర్-17 ప్రపంచకప్
- అక్టోబర్ 28న జరగనున్న ఫైనల్ మ్యాచ్
- తలపడనున్న ఇంగ్లండ్ - స్పెయిన్ దేశాలు
ఇటీవల జరిగిన సెమీ ఫైనల్ మ్యాచుల్లో బ్రెజిల్‌పై ఇంగ్లాండ్, మాలిపై స్పెయిన్ విజయం సాధించి ఫైనల్‌కి చేరుకున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం పశ్చిమ బెంగాల్ చేస్తున్న ఏర్పాట్లు తుదిస్థాయికి చేరుకున్నాయి. ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఫిఫా అధ్యక్షుడు జియానో ఇన్ఫాంటినో హాజరుకానున్నట్లు సమాచారం.