'ఓయ్ త‌మ్ముడూ..' అంటూ హీరో విజ‌య్‌ని పిలిచిన సమంత‌... 'అదిరింది' ట్రైల‌ర్ విడుద‌ల‌

  • వివాదాలు తొలగిపోవ‌డంతో తెలుగులో `మెర్స‌ల్‌`
  • రేపు తెలుగులో విడుద‌ల కానున్న `అదిరింది` చిత్రం
  • ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అట్లీ
ద‌ర్శ‌కుడు అట్లీ తీసిన `రాజా రాణి` చిత్రంలో హీరోయిన్‌, హీరోని బ్ర‌ద‌ర్ అని పిల‌వ‌డం ఇంత‌కుముందు చూశాం. ఇప్పుడు ఆయన ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `అదిరింది` చిత్రంలోనూ ఒక‌ హీరోయినైన‌ సమంత‌, హీరో విజ‌య్‌ని `ఓయ్ త‌మ్ముడూ..` అని పిలిచింది. సినిమా చుట్టూ అలముకున్న వివాదాలు తొల‌గిపోవ‌డంతో త‌మిళ `మెర్స‌ల్‌` చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేసేందుకు చిత్ర‌బృందం రెడీ అయింది. ఇందులో భాగంగా రేపు విడుద‌ల‌ కానున్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఈ రోజు విడుద‌ల చేశారు.

‘కళ్లు లేకుండా బతకొచ్చు. కానీ పిల్ల లేకుండా ఎవ్వరూ బతకలేరు’, `తల్లి బిడ్డను కనడానికి పది నెలలు పట్టుద్ది. ఒకరు డిగ్రీ అందుకోవడానికి మూడేళ్లు పట్టుద్ది. కానీ ఒక నాయకుడు ఉదయించడానికి ఒక యుగమే పట్టుద్ది’ అనే డైలాగులను ట్రైల‌ర్‌లో చూడొచ్చు. ఇక ఇందులో విజ‌య్ త్రిపాత్రాభినయం చేసిన సంగ‌తి తెలిసిందే. ముగ్గురు హీరోయిన్లైన కాజ‌ల్‌, నిత్యామీన‌న్‌, స‌మంత‌ల‌ను కూడా ఈ ట్రైల‌ర్‌లో చూడొచ్చు.

Go Back to Shorts
mersal
adirindi
vijay
samantha
atlee
nithya menon
kajal

More Telugu News