బ్రాండ్ విలువ‌లో మెస్సీని దాటేసిన కోహ్లీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్రాండ్ విలువ‌లో మెస్సీని దాటేసిన కోహ్లీ!

  • అత్యంత విలువైన టాప్-10 అథ్లెట్ల జాబితాను విడుద‌ల చేసిన ఫోర్బ్స్‌
  • 14.5 మిలియ‌న్ డాల‌ర్ల‌తో 7వ స్థానంలో కోహ్లీ
  • మొద‌టిస్థానంలో టెన్నిస్ క్రీడాకారుడు రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌
బ్రాండ్ విలువ‌లో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఫుట్‌బాల్ ఆట‌గాడు లియోన‌ల్ మెస్సీని దాటేశాడు. తాజాగా ఫోర్బ్స్ మేగ‌జైన్ విడుద‌ల చేసిన ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన టాప్‌-10 అథ్లెట్ల జాబితాలో విరాట్ కోహ్లీ స్థానం ద‌క్కించుకున్నాడు. 14.5 మిలియ‌న్ డాల‌ర్ల బ్రాండ్ విలువ‌తో విరాట్ 7వ స్థానంలో నిలిచాడు. మెస్సీ మాత్రం 13.5 మిలియ‌న్ డాల‌ర్ల‌తో 9వ స్థానంలో నిలిచాడు. దీన్ని బ‌ట్టి చూస్తే విరాట్ బ్రాండ్ విలువ రోజురోజుకీ పెరుగుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఇంకా ఈ జాబితాలో టెన్నిస్ క్రీడాకారుడు రోజ‌ర్ ఫెద‌ర‌ర్ మొద‌టిస్థానం ద‌క్కించుకున్నాడు. ఇత‌ని బ్రాండ్ విలువ 37.2 మిలియ‌న్ డాల‌ర్లు. క్రికెటర్లలో టాప్‌-10లో చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడు కోహ్లీనే కావడం విశేషం. మెస్సీ, గోల్ఫ్‌ సూపర్‌ స్టార్‌ రోరీ కంటే కూడా కోహ్లీకే బ్రాండ్‌ విలువ ఎక్కువగా ఉంది.

 ఫెద‌ర‌ర్ త‌ర్వాతి స్థానాల్లో బాస్కెట్ బాల్ ఆట‌గాడు లిబ్రాన్ జేమ్స్‌, స్ప్రింట‌ర్ ఉసేన్ బోల్ట్‌, ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ క్రిస్టియానో రొనాల్డో, గోల్ఫ్ ఆట‌గాళ్లు ఫిల్ మెకెల్‌స‌న్‌, టైగ‌ర్ వుడ్స్ ఉన్నారు. ప్రచారాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే ఫోర్బ్స్‌ పరిగణన‌లోకి తీసుకుని ఈ జాబితాను విడుదల చేసింది. ఆటకు సంబంధించిన జీతాలు, బోనస్‌, పెట్టుబడుల ద్వారా వచ్చే డబ్బును ఈ ఆదాయంలో కలపలేదు.
brand value
virat kohli
messi
roger federer
cristiano ronaldo
forbes

More Telugu News