కోహ్లీ థైప్యాడ్స్ పైనున్న ఆ ఆటోగ్రఫ్ అనుష్కదేనా?.. అభిమానుల చర్చ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోహ్లీ థైప్యాడ్స్ పైనున్న ఆ ఆటోగ్రఫ్ అనుష్కదేనా?.. అభిమానుల చర్చ!

  • కోహ్లీ థైప్యాడ్స్ పై ఆటోగ్రాఫ్
  • ఆ ఆటోగ్రాఫ్ అనుష్కదేనంటూ చర్చించుకున్న అభిమానులు
  • ఆటోగ్రాఫ్ పై ఎట్టకేలకు క్లారిటీ
క్రికెట్ ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ సందర్భంగా థైప్యాడ్స్ ధరించి ప్రాక్టీస్ చేస్తుంటారు. ఈ ధైప్యాడ్స్ పై తమకు ఇష్టమైన వారు లేదా తమలో స్పూర్తి నింపినవారి ఆటోగ్రాఫ్ తీసుకుంటారు. వాటిని కట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మరింత బాగా ఆడేందుకు అలాంటివి ఉపయోగపడుతుంటాయని క్రికెటర్లు పేర్కొంటుంటారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కట్టుకునే థైప్యాడ్స్ పైన ఒక ఆటోగ్రాఫ్ ఉంది. అది అతని ప్రేయసి అనుష్క శర్మదా? అంటూ చాలా కాలంగా క్రికెట్ అభిమానుల్లో ఒక చర్చ నడుస్తోంది. దానికి ఇన్నాళ్టికి సమాధానం లభించింది.

 అభిమానులు భావించినట్టు ఆ ఆటోగ్రాఫ్‌ అనుష్కది కాదు, స్టీవ్‌ రింఫ్రీది. 1987లో ప్రారంభమైన స్టీవ్ రింఫ్రీ సంస్థ క్రికెటర్లకు అవసరమైన గార్డులు, ప్యాడ్ల వంటి రక్షణ సామగ్రిని తయారుచేస్తుంది. ఇది తయారు చేసిన రక్షణ వస్తువులను దిగ్గజ క్రికెటర్లు అలన్‌ బోర్డర్‌, గ్రాహమ్‌ గూచ్‌, సునీల్‌ గవాస్కర్‌, షేన్‌ వార్న్‌ వాడారు. ఈ సంస్థ తయారు చేసిన వాటినే కోహ్లీ కూడా వినియోగిస్తున్నాడు. దీంతో ఆ సంస్థకు చెందిన ఆటోగ్రాఫ్ కోహ్లీ థైప్యాడ్స్ పై కనబడుతోంది. 
kohli
anushka
autograph
thigh pad
team India
gavaskar

More Telugu News