ఆ మాటకు అర్థమేమి?.. ఇలియానా పెళ్లి చేసేసుకుందా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ మాటకు అర్థమేమి?.. ఇలియానా పెళ్లి చేసేసుకుందా?

  • పెళ్లి ముఖ్యం కాదని పలు సందర్భాల్లో చెప్పిన ఇలియానా
  • ఆస్ట్రేలియా ఫోటో గ్రాఫర్ తో రిలేషన్ లో ఉన్నానని చెప్పిన గోవా బ్యూటీ 
  • బెటర్ హాఫ్ అని పేర్కొన్న ఇలియానా
టాలీవుడ్ నాజూకు సుందరి ఇలియానాకు పెళ్లయిందా? గత కొంత కాలంగా హిందీ మీడియాను వేధిస్తున్న ప్రశ్న. తాను రిలేషన్ లో ఉన్నానని, అయినా తనకు పెళ్లిచేసుకున్నామా? లేదా? అన్నది ముఖ్యం కాదని పలు సందర్భాల్లో ఇలియానా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో అనుబంధం కొనసాగిస్తున్న ఇలియానా తాజాగా ట్విట్టర్ లో చేసిన పోస్టు ఒకటి వారిద్దరికీ వివాహం జరిగినట్టు చెబుతోంది.

ట్విట్టర్ ఖాతాలో  ‘మిమ్మల్ని నవ్వించే, ప్రేమించే స్నేహితులను వెతుక్కోండి’ అని చెబుతూ ఒక ఫొటోను పోస్టు చేసింది. ఆ ఫొటో క్రెడిట్ తన బెటర్ హాఫ్ కి చెందుతుందని పేర్కొంటూ ఆండ్రూ నీబోన్ కు ఇచ్చింది. దీంతో ఇది వైరల్ గా మారింది. సాధారణంగా బెటర్ హాఫ్ అనే పదాన్ని భార్యాభర్తలు మాత్రమే వాడుతారు. ప్రేమికులు, స్నేహితులు వాడరు. ఇలియానా తన ప్రియుడ్ని రహస్యంగా పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో చేసిన ఈ ట్వీట్ ఆమె అభిమానుల్లో చర్చకు తెరతీసింది. 
illana d'cruz
andrew kneebone
marriage
love

More Telugu News