జీవితంలో హారర్ సినిమాలు చేయను : సిద్ధార్థ్ ప్రశ్నకు నాని జవాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జీవితంలో హారర్ సినిమాలు చేయను : సిద్ధార్థ్ ప్రశ్నకు నాని జవాబు

  • హీరోగా.. నిర్మాతగా సిద్ధార్థ్ 'గృహం'
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు 
  • హారర్ సినిమాల గురించి నానికి సిద్ధార్థ్ ప్రశ్న 
  • అందుకు ఓ లాజిక్ ఉందంటూ నాని సమాధానం    
సిద్ధార్థ్ కథానాయకుడిగా రూపొందిన 'గృహం' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి ఆయన నిర్మాత కూడా. ఈ సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొన్న సిద్ధార్థ్ .. ఆ కార్యక్రమానికి హాజరైన నానికి ఒక ప్రశ్న వేశాడు. "నాని నువ్ హారర్ సినిమాలు చేస్తావా .. చేయవా? చేస్తే ఎందుకు చేస్తావు .. చేయకపోతే ఎందుకు చేయవు? అనే విషయం చెప్పాలంటూ పట్టుపట్టాడు.

 అందుకు నాని స్పందిస్తూ .. "లైఫ్ లో హారర్ సినిమాలు చేయను .. ఎందుకు చేయను అనడానికి నా దగ్గర ఒక లాజిక్ వుంది. నాకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం. ప్రతి హారర్ మూవీ చూస్తాను. నెక్స్ట్ ఏం జరగబోతోందనే ఒక టెన్షన్ ను నేను ఎంజాయ్ చేస్తాను. నేను హారర్ ఫిల్మ్ చేయడం వలన .. ఆ హారర్ మూవీని ఎంజాయ్ చేయడం మిస్సవుతాను" అంటూ సమాధానమిచ్చాడు. ఆయన లాజిక్ పట్ల తాను సంతృప్తి చెందినట్టు చెబుతూ సిద్ధార్థ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.   
nani
siddharth

More Telugu News