నాతో ఉండేవాళ్లు రండి... రేపు అసెంబ్లీలో టీడీపీ ఎల్పీ మీటింగ్: రేవంత్ రెడ్డి

  • లెజిస్లేచర్ మీటింగ్ కు కాల్ చేసిన రేవంత్
  • టీడీపీఎల్పీ లీడర్ ను తానేనని వెల్లడి
  • సమావేశాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు
  • ప్రస్తుతం రేవంత్ తో పాటు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి వివాదం మరింతగా ముదిరింది. తనను సస్పెండ్ చేయాలని కోరుతూ ఎల్ రమణ స్వయంగా చంద్రబాబుకు లేఖ రాయడంపై రేవంత్ స్పందించారు. వర్కింగ్ ప్రెసిడెంట్, అసెంబ్లీ నేత హోదాలో ఏకంగా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ కు కాల్ చేశారు. రేపు ఉదయం అసెంబ్లీలో టీడీపీ ఎల్పీ సమావేశానికి రావాలని ప్రజా ప్రతినిధులను ఆహ్వానించారు.

 టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ ను తానేనని, తన సమావేశాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఈ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యానించడం గమనార్హం. తన వెంట నడిచే వాళ్లు తనతోనే ఉంటారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. కాగా, ప్రస్తుతం టీడీపీ తరఫున రేవంత్ తో పాటు ఆర్ కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్యలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. మిగతావారంతా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇక వీరిద్దరిలో ఎవరు రేపు రేవంత్ వెంట నిలుస్తారన్నది ఆసక్తికరం.
Go Back to Shorts
l ramana
revant reddy
Telugudesam

More Telugu News