రేవంత్ ఇక మనకొద్దు: చంద్రబాబుకు ఎల్ రమణ లేఖ
- పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాడు
- సాధ్యమైనంత నష్టం కలిగించాలన్నదే రేవంత్ ఉద్దేశం
- వెంటనే సస్పెండ్ చేయండి
- అధినేతకు ఎల్ రమణ లేఖ
- రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం
రేవంత్ పార్టీ మారడం ఖాయమని, ఈ లోగా సాధ్యమైనంత మేరకు టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నారని, కాబట్టి ముందే నిర్ణయం తీసుకుందామని కూడా రమణ సూచించినట్టు సమాచారం. ప్రస్తుతం లండన్ లో ఉన్న చంద్రబాబు, నేటి రాత్రికి ఇండియాకు తిరుగు ప్రయాణం కానున్నారు. ఆయన వచ్చిన తరువాత ఒకటి రెండు రోజుల్లో రేవంత్ పై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.