తమిళ తెరపైకి ఎంజీఆర్ బయోపిక్ .. టైటిల్ రోల్ లో సత్యరాజ్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళ తెరపైకి ఎంజీఆర్ బయోపిక్ .. టైటిల్ రోల్ లో సత్యరాజ్?

  • ఎంజీఆర్ బయోపిక్ ను తెరకెక్కించే ప్రయత్నాలు
  • ఎంజీఆర్ పాత్రను సత్యరాజ్ చేసే ఛాన్స్ 
  • దర్శకుడిగా బాలకృష్ణన్ 
  • వచ్చేనెల 8వ తేదీన సెట్స్ పైకి    
కథానాయకుడిగా .. రాజకీయ నాయకుడిగా ఎం.జి.రామచంద్రన్ తమిళనాట ఎంతో ప్రభావం చూపారు. లక్షలాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నారు .. వ్యక్తిత్వం విషయంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అలాంటి ఎంజీఆర్ బయోపిక్ ను తెరకెక్కించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. రమణ కమ్యూనికేషన్స్ వారు బాలకృష్ణన్ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించడానికిగాను రంగంలోకి దిగారు.

 ఎంజీఆర్ పాత్రను పోషించడం అంత తేలికైన పనికాదు. ఆ పాత్రలో మెప్పించడం అంత ఆషామాషీ వ్యవహారమూ కాదు. అందువలన బాగా ఆలోచించి .. ఈ పాత్రకి సత్యరాజ్ అయితే కరెక్ట్ గా సరిపోతారని యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చేనెల 8వ తేదీన పలువురు మంత్రుల సమక్షంలో తమిళనాడు సి.ఎం.పళని స్వామి క్లాప్ కొట్టడంతో ఈ సినిమా మొదలవుతుందని సమాచారం.    
sathyaraj

More Telugu News