కేసీఆర్ కనికరం కోసం కాళ్లపై పడ్డ కోమటిరెడ్డి: గుత్తా ఫైర్
- టీఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నించారు
- కేసీఆర్ ఆయన్ని దూరం పెట్టారు
- ఇప్పుడు రైతులను రెచ్చగొడుతున్నారు
టీఆర్ఎస్ లో చేర్చుకోకపోవడంతో ఇప్పుడు 'ఛలో అసెంబ్లీ' పేరుతో కోమటిరెడ్డి కొత్త డ్రామాకు తెరతీశారని అన్నారు. ఇలాంటి వ్యక్తులను రైతులు నమ్మరాదని అన్నారు. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు మంచివి కాదని తెలిపారు. వర్షాల కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నది వాస్తవమేనని... అయితే, పత్తి కొనుగోలు కోసం సీసీఐ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు.