హాలీవుడ్ లో మరో కలకలం... ఆ దర్శకుడు వేధించాడంటూ 38 మంది మహిళల ఫిర్యాదు
- నిర్మాత హార్వే వీన్ స్టీన్ వివాదం సద్దుమణగకముందే హాలీవుడ్ లో మరో లైంగిక వేధింపుల వివాదం
- జేమ్స్ టొబాక్ తమను వివిధ సందర్భాల్లో వేధించాడన్న 38 మంది మహిళలు
- స్టార్ హోదా వచ్చేలా చేస్తానని వేధింపులకు దిగాడన్న మహిళలు
పనిలోకి తీసుకున్న మహిళలు, పనికోసం వెతుకుతున్న స్త్రీలు, వీధుల్లో తారసపడ్డ మహిళలపై టొబాక్ లైంగిక వేధింపులకు దిగేవాడని వార్తా సంస్థ తెలిపింది. వీరిలో కొందరికి స్టార్ హోదా వచ్చేలా చేస్తానని కూడా వాగ్దానం చేసినట్టు వారు తెలిపారు. వారిని కలిసినప్పుడు తనకు ప్రముఖులతో లైంగిక సంబంధాలు ఉన్నాయని టొబాక్ ప్రగల్భాలు పలికేవాడని వారు వెల్లడించారు. ఆ సమయంలో తమను అవమానకర రీతిలో ప్రశ్నలు అడిగే వాడని వారు ఆరోపించారు. కాగా, దీనిపై టొబాక్ స్పందించారు. వారెవరో తనకు తెలియదని అన్నారు. వారిని తానెప్పుడూ కలవలేదని ఆయన ప్రకటించారు.