ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్‌పై టీమిండియా అభిమానుల ఎదురుదాడి
- జోన్స్‌పై విరుచుకుపడుతున్న భారత అభిమానులు
- ఆసీస్ కంటే న్యూజిలాండే ఉత్తమ జట్టన్న నెటిజన్లు
- సాక్ష్యం కావాలంటే మరోసారి భారత్ రావాలని పిలుపు
డీన్ జోన్స్ ట్వీట్‌తో ఒళ్లుమండిన భారత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిలాగే ఎగతాళి ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. ఆస్ట్రేలియా కంటే న్యూజిలాండే ఉత్తమ జట్టని ఒకరంటే, ఆ జట్టును చూసి ఆస్ట్రేలియా నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఇంకొకరు ట్వీటారు. వారు గెలిచారని, ఆసీస్ మాత్రం 4-1తో ఓడిందని గత సిరీస్‌ను గుర్తు చేశారు. సాక్ష్యం కావాలంటే మరోసారి ఇండియా రావాలంటూ గట్టిగా బదులిచ్చారు.