రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్పా ఎవరూ సంతోషంగా లేరు: కోమటిరెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్పా ఎవరూ సంతోషంగా లేరు: కోమటిరెడ్డి

  • ప్రజలను తాగుబోతులుగా మారుస్తున్న ప్రభుత్వం
  • రైతులను ఎన్నో విధాలుగా మోసం చేసిన కేసీఆర్
  • ఈ నెల 27న ‘ఛలో అసెంబ్లీ’
  • లక్షలాదిగా తరలి రావాలని వెంకటరెడ్డి పిలుపు
రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్పా ఎవరూ సంతోషంగా లేరని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఈ నెల 27న తలపెట్టిన ‘ఛలో అసెంబ్లీ’కి లక్షలాదిగా తరలి రావాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులను కేసీఆర్ ఎన్నో విధాలుగా మోసం చేస్తున్నారని, రైతులను ప్రభుత్వం ఆదుకునే వరకూ పోరాటం చేస్తామని అన్నారు. ప్రజలను తాగుబోతులుగా మార్చి, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కోమటిరెడ్డి వెంకట రెడ్డి
కేసీఆర్

More Telugu News