Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దీపావళి వెలుగుల్లో స్పేస్ నుంచి ఇండియా ఇలా... ట్విట్టర్ లో ఫోటో పంచుకున్న వ్యోమగామి!

  • ఫొటో తీసిన ఇటలీ వ్యోమగామి
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటో
  • వేల సంఖ్యలో లైక్ లు, షేర్లు
దీపావళి పర్వదినం రోజు, వాడవాడలా టపాకాయలు పేలుతుంటే ఆ దృశ్యాన్ని అంతరిక్షం నుంచి వీక్షించే అవకాశం ఇటలీకి చెందిన ఆస్ట్రోనాట్ పాలో నెస్పోలీకి లభించింది. 19వ తేదీన దీపావళి నాడు అంతరిక్షంలో ఉన్న పాలో, భారత్ చిత్రాన్ని తీసి తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఇండియన్స్ కి దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నట్టు తెలిపారు. ఇక ఈ ఫోటో వైరల్ అయింది. మిగతా ప్రపంచమంతా చీకటిగా కనిపిస్తుంటే ఇండియా మాత్రం వెలిగిపోతున్న ఫోటోకు వేల సంఖ్యలో లైక్ లు, షేర్లు, రీట్వీట్లు వచ్చాయి. పాలో ట్వీట్ చేసిన ఫోటోను మీరూ చూడవచ్చు.
space
india
deepavali

More Telugu News