రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి లిస్టు ఇచ్చారంటూ వచ్చిన వార్తలపై ఎల్.రమణ స్పందన!

21-10-2017 Sat 16:39 | National
  • అప్పట్లో అటువంటి వార్తలు వస్తే నేను ఖండించాను
  • రేవంత్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి తన వైఖరి చెప్పాలి
  • పార్టీని దెబ్బతీసేలా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి
  • నేను ఎప్ప‌టికీ టీడీపీని వ‌దిలిపోన‌ని అప్పుడే చెప్పా  
 త‌మ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అవాల‌నుకుంటున్న వారి పేర్ల‌ను లిస్టుగా రాసి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఇచ్చారంటూ ఈ రోజు కొన్ని పేపర్లలో వార్తలు రావడంపై టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మండిపడ్డారు. అనుమానాలు రేకెత్తించేలా ఇటువంటి వార్త‌లు రాయ‌కూడ‌ద‌ని ఆయన అన్నారు. అలాగే త‌మ నేత‌లు పార్టీకి చెడ్డ పేరు వ‌చ్చేట్లుగా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌ద‌ని హిత‌వు పలికారు.

ఈ రోజు హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ర‌మ‌ణ మాట్లాడుతూ.... ప‌త్రిక‌ల్లో ఇటువంటి వార్త‌లు వ‌చ్చిన‌ప్పుడు అందుకు కార‌ణ‌మైన వారు మీడియా ముందు‌కు వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని అన్నారు. క్రమ ‌శిక్ష‌ణారాహిత్య చ‌ర్య‌ల‌కు పాల్ప‌డకూడ‌ద‌ని చెప్పారు.

గ‌తంలో త‌న‌పై కూడా ప‌లు అస‌త్య వార్త‌లు వ‌చ్చాయ‌ని, తాను వేరే పార్టీలోకి వెళ్లాల‌ని చూస్తున్న‌ట్లు రాశార‌ని చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీ వ‌ల్లే ఈ రోజు ఈ స్థాయికి ఎదిగాన‌ని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండి ప్ర‌జాసేవ చేసుకుంటోన్న తాను ఎప్ప‌టికీ టీడీపీని వ‌దిలిపోన‌ని అప్పుడే తేల్చి చెప్పానని అన్నారు. కాగా, చంద్రబాబుకు అన్ని విషయాలను వివరిస్తానని నిన్న రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు.  
ఎల్.రమణ

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more