2018లోగా ఫుట్బాల్ ఆటగాడిగా మారనున్న ఉసెన్ బోల్ట్
- గాయాల కారణంగా ఫిట్నెస్ కోల్పోయిన మాజీ స్ప్రింటర్
- ఉత్తమ ఆటగాడు రొనాల్డో అంటున్న ఉసెస్ బోల్ట్
- మెస్సీ, నేమార్లు కూడా ఇష్టమే!
ఫుట్బాల్లో ఉత్తమ ఆటగాడిగా క్రిస్టియానో రొనాల్డోను ఉసెన్ బోల్ట్ ఎంచుకున్నాడు. లియోనల్ మెస్సీ, నేమార్లు కూడా తనకు ఇష్టమని, వాళ్లు బాగా ఆడతారని ఆయన పేర్కొన్నాడు. అలాగే ఏ ఆటలోనైనా అత్యున్నత స్థాయికి చేరాలంటే మంచి క్రమశిక్షణ, ఆశయం, పట్టుదల, కష్టపడే తత్వం కావాలని బోల్ట్ చెప్పాడు.