Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెహ్వాగ్ పుట్టిన‌రోజుకి స‌చిన్ ఫ‌న్నీ ట్వీట్‌... మీరు చ‌ద‌వ‌గ‌ల‌రా?

  • అక్ష‌రాల‌ను తిర‌గేసి ట్వీట్ చేసిన మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌
  • ఫ‌న్నీ రిప్లై ఇచ్చిన సెహ్వాగ్‌
  • విషెస్ తెలిపిన ఇత‌ర క్రికెట‌ర్లు, ప్రముఖులు, అభిమానులు
క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న ట్విట్ట‌ర్ ఖాతా బ‌ర్త్‌డే విషెస్‌ల‌తో నిండిపోయింది. క్రికెట్ ఆట‌గాళ్లు, ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు, అభిమానులు ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌దైన శైలిలో సెహ్వాగ్‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. సెహ్వాగ్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచేస్తూ మీమేలు, ఫొటోలు, క‌విత్వాలు, పంచ్‌లైన్లు షేర్ చేశారు. కానీ వారంద‌రిలోకెల్లా మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ చేసిన ట్వీట్ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది.

`హ్యాపీ బ‌ర్త్‌డే వీరూ... హావ్ గ్రేట్ స్టార్ట్ టు ద న్యూ ఇయ‌ర్‌.. మైదానంలో నేను చెప్పిన దానికి నువ్వు ఉల్టాగా (వ్య‌తిరేకంగా) చేసేవాడివి. అందుకే నీకోసం ఇలా!` అంటూ ట్వీట్‌లో అక్ష‌రాల‌ను తిర‌గేసి రాశాడు. ఈ ట్వీట్‌కి వెంట‌నే వీరూ ఫ‌న్నీగా రిప్లై ఇచ్చాడు. `థ్యాంక్యూ గాడ్ జీ (దేవుడా), పైవాడు అన్నీ గ‌మ‌నిస్తూనే ఉంటాడ‌ని ఇప్ప‌టి వ‌ర‌కూ విన్నాను. ఆయ‌న కింద ఉన్న వాళ్ల‌కు ఎలా రాస్తాడోన‌ని ఇవాళ అర్థమైంది` అని సెహ్వాగ్ ట్వీటాడు.
sehwag
sachin
funny tweet
birthday
master blaster
ulta

More Telugu News